మూడు రాజధానుల అంశం ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రాజధానుల కేసు పై విచారణను వాయిదా వేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు. ఉప సంహరణ బిల్లుపై మెమో దాఖలు చేయడానికి సమయం కావాలని ఈ సందర్భంగా కోరారు ఏజీ.
శుక్రవారం అఫిడవిట్ తో మెమో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. కాగా… సీఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో బిల్లు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్లారు మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు శాసనసభలో ప్రకటించింది ప్రభుత్వం.గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ బిల్లును పెట్టారు మంత్రి బుగ్గన.