ఉత్తరప్రదేశ్‌లో కొందరు నేటికీ రౌడీలుగా చెలామణీ అవుతూ సామాన్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రాకతో రౌడీయిజం, మాఫియా ఆనవాళ్లు తగ్గినప్పటికీ ఇప్పటికీ కొందరు తమ అజమాయిషీ చెలాయించేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యూపీలోని కాన్పూర్‌లో ఓ వ్యక్తి రోడ్డుకు అడ్డంగా కారును నిలిపి పక్కన గల దుకాణంలో పూలు కొనేందుకు వెళ్లాడు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు అతన్ని కారు తీయాలని అడగ్గా.. డ్రైవర్‌తో వారికి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కారులో నుంచి రైఫిల్‌తో బయటకు వచ్చి వాహనదారులను బెదిరించాడు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. పబ్లిక్‌గా రైఫిల్ చూపించి జనాలను భయపెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.