నానిని విపరీతంగా ట్రోల్ చేస్తున్న ఆడియన్స్.. కారణం ఏంటో తెలుసా..

-

ఇండియన్‌ సినిమాల్లో సిరీస్‌, ఫ్రాంఛైజీలు ట్రెండ్ గా మారాయి అని చెప్పవచ్చు.. ఇదే నేపథ్యంలో వచ్చిన హిట్ ఫ్రాంఛైజీ కూడా ట్రెండ్ సెట్ చేసింది… మొదటి సినిమా హిట్‌ కావడం, `హిట్‌2` స్కేల్‌ పెంచడం, అడివి శేష్‌ నటించడం, దీన్ని ఏడు సిరీస్‌లుగా తీసుకురాబోతున్నారనే అంశాలు మరింత హైప్‌ తీసుకొచ్చాయి. అయితే హిట్టు 2 క్లైమాక్స్ లో హిట్ 3 కోసం లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేశారు..

`హిట్‌2` క్లైమాక్స్ లోనే `హిట్‌ 3 ది థర్డ్ కేసు` గురించి చెప్పేశారు.. మూడో భాగంలో హీరోగా నానిని ప్రకటించారు. ఎండింగ్‌లో ఆ విషయాన్ని చూపించే సన్నివేశాలు, హీరో ఇంట్రడక్షన్‌ ఓ రేంజ్‌లో ఇచ్చారు. దీంతో థియేటర్లు హోరెత్తిపోయాయి. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ నానిని హీరోగా చూపించిన తర్వాతే అసలు సమస్య స్టార్ట్ మొదలైంది. నాని థ్రిల్లర్‌ చిత్రాలకు ఆయన సెట్‌ కాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. `హిట్‌ 3′ సినిమాకి హీరోగా నాని సెట్ కాడని, ఇక `హిట్‌`ని ఆ దేవుడే కాపాడాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదే విషయాన్ని వెల్లడిస్తూ నానిని ట్రోల్‌ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

అలాగే ‘హిట్‌`తో పోల్చితే `హిట్‌2` ఆశించిన స్థాయిలో లేదనే టాక్‌ ఉంది. `హిట్‌3`తో ఆ క్రేజ్‌ మరింత పడిపోతుందని, ఇక ఈ సిరీస్‌ క్లోజ్‌ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. అదే సిరీస్ గా వస్తున్న వీటిల్లో ఏ ఒక్క సినిమా సరిగా ఆడకపోయినా పక్కన పెట్టేస్తారు అభిమానులు.. అయితే ఏది ఏమైనా ఈ చిత్రం ఇప్పుడు తీవ్రస్థాయిలో ట్రోల్స్ విమర్శలు ఎదుర్కోవటం చిత్ర బృందానికి కొంత బాధ కరమైన విషయమైనా చెప్పాలి అయితే విడుదలైన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మరి.. ఇందులో మలుపులతో ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తారో ప్రస్తుతం అయితే ప్రశ్నఆర్థకంగానే మారింది..

Read more RELATED
Recommended to you

Latest news