ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరమైతే.. మరికొంతమంది అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు . ఇక అందులో భాగంగానే తమ అందాల ప్రదర్శన చేస్తూ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకొని.. ఈ క్రమం లోనే ఇండస్ట్రీలోకి రావాలని కలలు కంటున్నారు. ఇకపోతే చాలామంది హీరోయిన్ లు బికినీ ట్రీట్ ఇస్తూ కుర్ర కారు గుండెల్లో మంట పెడుతూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. ఇక అలాంటి వారిలో అందాల ముద్దుగుమ్మ చిన్నారి పెళ్ళికూతురు అలియాస్ అవికా ఘోర్ కూడా ఒకరు.
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న అవికా ఆ తర్వాత ఉయ్యాల జంపాల చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న ఈమె ఆ తర్వాత వరుస ఫ్లాప్ లతో తన కెరియర్ను కొనసాగించలేకపోయింది. ఇక ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను కోసం పూర్తిగా సన్నబడినా కూడా ఈమెకు అవకాశాలు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా గతంలో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం, ఆన్ స్క్రీన్ పై మసాలా సన్నివేశాలకు నో చెప్పడం వంటి కారణాలతోనే ఈమెకు దర్శక నిర్మాతలు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు.
అందుకే తనను తాను మార్చుకుంటూ వయ్యారాలు వలకబోస్తూ.. తన లో వున్న గ్లామర్ యాంగిల్ ను తట్టి లేపింది. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీల తరహాలో మాల్దీవుల వేదికగా మంటలు షురూ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక మొన్నటి వరకు సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన ఈమె ఒక్కసారిగా బికినీలో కనిపించడంతో సోషల్ మీడియా కామెంట్రీ బాక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కింది. తాజాగా మాల్దీవుల వెకేషన్ ఫోటోలను నెట్టింట వదిలి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ డిజైన్ లో 2 పీస్ లో తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. రొమాంటిక్ మూడ్ ఆస్వాదిస్తున్నట్లు టూ పీస్ బికినీలో చూపుర్లను బాగా ఆకట్టుకుంది. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాలీవుడ్లో 1920 అనే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.