బంగారు తాబేలు జననం.. పూజలుతో హోరెత్తిన నేపాల్

-

బంగారు క‌వ‌చంతో పుట్టిన ఓ తాబేలు ఇప్పుడు వార్తలలో నిలిచింది.ఈ తాబేలును నేపాల్‌లో దేవుడిగా పూజిస్తున్నారు. బంగారు రంగులో ఉన్న ఈ తాబేలు మెరుస్తూ ఎంతో ఆకర్షణీయంగా కనబడుతోంది. ఇలా బంగారు క‌వ‌చంతో ఆ తాబేలు పుట్టడానికి కారణం జ‌న్యుప‌రివ‌ర్త‌న కారణం అని డాక్టర్లు చెబుతున్నారు ఇలాంటి ఘటన జరగడం ఇది మొదటి సారి కాదు ఇప్పటికీ నాలుగు సార్లు ఇలాంటి ఘటన చోటచేసుకుంది.ఈ తాబేలును నేపాల్ తో పాటు భారత్ లోనూ కూడా పూజలు చేస్తారు.

golden_shell_turtle
golden_shell_turtle

తాబేలు పైనున్న షెల్‌ను ఆకాశాన్ని, కిందున్న షెల్‌ను భూమిని సూచిస్తుంద‌ని డాక్టర్ లు అంటున్నారు. వారి అభిప్రాయం ప్ర‌కారం క్రోమాటిక్ లూసిజం వ‌ల్ల తాబేలుకు మెరిసే షెల్ వ‌చ్చిందంటున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జాతుల‌లో ఈ తాబేలు ఐద‌వ‌ది.క్రోమాటిక్ లూసిజం వ‌ల్ల తాబేలుకు మెరిసే షెల్ వ‌చ్చిందంటున్నారు నిపుణులు. ఈ లూసిజం తెలుపు, లేత‌, పాచీ రంగులో ఉంటుంది. ఇది చూడటానికి ఎనిమిదో వింతలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news