ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం షాక్…

-

కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినం గా అమలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇటీవల కేంద్రం లాక్ డౌన్ ని మళ్ళీ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక విడుదల చేసిన గైడ్ లైన్స్ లో కొన్ని సంచలన నిర్ణయాలను వెల్లడించింది. లాక్ డౌన్ ని పెంచుతూనే ఈ కామర్స్ సంస్థలకు అనుమతి ఇచ్చింది కేంద్రం. దీనితో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు సన్నాహకాలు చేసాయి.

అయితే వారి నుంచి కరోనా వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. దీనితో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వారిని ఇప్పట్లో అనుమతించవద్దు అని భావిస్తుంది. ఈ మేరకు తాజాగా ఒక నోటిఫికేషన్ ని కూడా కేంద్రం విడుదల చేసింది. పూర్తిగా వాటిని నిషేధిస్తున్నామని లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు కూడా వాటి కార్యాకలాపాలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

ఇక రిటైల్ వ్యాపారులు కూడా వాళ్ళను అనుమతించడం పై ముందు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమకు అనుమతి ఇవ్వకుండా ఆ సర్వీసులకు ఎలా అనుమతి ఇస్తారని మండిపడ్డారు. దీనితో తలొగ్గిన కేంద్రం వారిని కూడా కంట్రోల్ చెయ్యాలని భావించి ఇక ఎలాంటి పరిస్థితుల్లో కూడా కరోనా తగ్గే వరకు కూడా అనుమతి ఇవ్వకుండా ఉండటమే మంచిది అనే నిర్ణయానికి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news