విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కేంద్రం నుంచి 8 నెలల్లోనే రూ. లక్షల కోట్ల నిధులు వచ్చాయని అన్నారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బడ్జెట్ లో లేని వాటికి సైతం కేంద్రం సాయం చేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. వికసిత్ భారత్ లో ఏపీ ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు.
“ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని నీతి ఆయోగ్ చెప్పింది. 2023 నాటికి రెవెన్యూ గ్రోత్
చాలా పడిపోయింది. 2014-19 మధ్య రూ. వందలో రూ. 59 ఖర్చు పెట్టాం. అదే 2019-24 మధ్య
రూ. వందలో రూ.22.54 మాత్రమే ఖర్చు పెట్టారని నీతిఆయోగ్ తెలిపింది. ఏపీ పరిస్థితి మెరుగు పర్చేందుకు కృషి చేయాలని, విద్యాప్రమాణాలు పెంచే స్టార్స్ కార్యక్రమంలో ఏపీని కూడా చేర్చాలని కేంద్రాన్ని కోరాం. నదుల అనుసంధానానికి నిధులు ఇవ్వాలని కోరాం” అని వివరించారు.