కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. రాత్రి 10 వ‌ర‌కు టీకాలు

-

కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తి రోజు వ్యాక్సిన్ల‌ను రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు పంపిణీ చేయాల‌ని కేంద్రం రాష్ట్రాల‌కు సూచించింది. అలాగే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తు లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా కరోనా సోకిన వారిలో కేవ‌లం 5 నుంచి 10 శాతం మంది బాధితుల‌కే ఆస్ప‌త్రిలో చికిత్స అవ‌స‌రం అవుతుంద‌ని తెలిపారు. మిగితా వారికి హోం ఐసోలేష‌న్ ఉంటే స‌రిపోతుంద‌ని తెలిపారు.

అయితే ప్ర‌స్తుతం పరిస్థితి అర్థం లేకుండా ఉంద‌ని తెలిపారు. ఆస్ప‌త్రిలో చేరే వారి సంఖ్య క్ర‌మంగా పెరిగే అవ‌కాశం కూడా ఉంద‌ని లేఖలో తెలిపారు. అందు కోసం అన్ని రాష్ట్రాల వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాల‌ని సూచించారు. ఆస్ప‌త్రులలో ఆక్సిజ‌న్ తోపాటు బెడ్స్ కూడా అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. అలాగే క‌రోనా సోకిన వారిని త‌ర‌లించేందుకు అంబులెన్స్ ల‌ను కూడా సిద్ధంగా ఉంచాల‌ని తెలిపారు. అలాగే ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు, క్లినిక్ లు అధిక ఫీజులు వ‌సూల్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news