శివ లింగం పై నాగుపాము ప్రత్యక్షం..ప్రదక్షిణలు ఆపై..

-

ప్రకృతిలో ప్రతి వస్తువుని కూడా హిందువులు దైవంగా భావిస్తారు.. ఈ సృష్టిలో ప్రతి అనువును దైవంగా పూజిస్తారు.మనుషుల లో మాత్రమే కాదు. జంతువులలో కూడా జంతువులు, పాములు, పక్షులు కూడా ఇలా సమస్త జీవరాశిలో దైవాన్ని చూసే నేచర్ మనది. కుక్క,ఆవు, నాగుపాము, కాకి ఇలా అనేక జంతువులను, పక్షులను దైవంగా భావించి పూజిస్తాం. పాములకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏడూ లోకాల్లో ఒకటి నాగలోకం.. అమృతం కోసం పాలకడలిని చిలికిన సమయంలో వాసుకి అనే సర్పం తాడుగా ఏర్పడింది..

 

శివయ్య మెడలో కంఠాభరణం నాగుపాము, శ్రీ విష్ణువు పాన్పు ఆదిశేషుడు ఇలా పాముల గురించి పురాణాల్లో రకరకాల కథలు ప్రస్తావనలో ఉన్నాయి. శ్రీకాళహస్తి క్షేత్రం లో భోళాశంకరుడి పూజను చేసింది పాము.. అయితే తరచుగా పాములు శివాలయాల్లోకి వెళ్లి.. దర్శినమిచ్చిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..

కాగా, తాజాగా ఓ శివాలయం లో పెద్ద నాగుపాము ప్రత్యక్షం అయ్యింది. ఇది ఎక్కడో కాదు మన తెలంగాణలో వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా.. దోమకొండ శివారులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఇక్కడ శివయ్య తనయుడు సుబ్రహ్మణ్య స్వామితో పాటు అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. శివయ్య కూడా భక్తులతో పూజలను అందుకుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా శివాలయంలోని గర్భాలయంలో నాగుపాము ప్రత్యక్షం.

లింగాన్ని చుట్టుకుని కొంచెం సేపు ఉన్న పాము.. అనంతరం లింగం చుట్టూ సుమారు గంట పాటు నాగుపాము ప్రదక్షిణలు చేసింది. దీంతో ఈ వింతను చూడడానికి శివయ్యను దర్శించుకోవడానికి భారీగా భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. శివనామ స్మరణంతో ఆలయ ప్రాంతం మార్మోగిపోయింది.. ఆ తర్వాత పామును ప్లాస్టిక్‌ డబ్బాలోకి తీసుకోని దగ్గరలోని అడవుల్లో వదిలి పెట్టారు.. ఈ ఘటనకు సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news