హామిల్టన్ లోని సెడాన్ పార్క్ వేదికగా జరగాల్సిన భారత్ – న్యూజిలాండ్ రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ ని ప్రారంభించింది. భారత జట్టు తరుపున ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ శిఖర్ ధావన్, శుభమన్ గిల్ జోడి 4.5 ఓవర్లలో 22 పరుగులు చేసింది.
ఆ సమయంలో వర్షం ప్రారంభం కావడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. వర్షం కారణంగా మ్యాచ్ కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత ఎంపైర్లు మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ మొదలవగానే శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 34, గిల్ 45 తో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ 12.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసిన సమయంలో మళ్లీ ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఇక వర్షం ఎంతకు తగ్గకపోవడంతో ఆటని రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు.