గూగుల్‌కు షాక్‌ ఇచ్చిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. ఏకంగా రూ.1,337.76 కోట్ల జరిమానా..

-

అది పెద్ద సర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌కు పెద్ద షాక్‌ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) రూ.1,337.76 కోట్ల జరిమానా(Penalty) విధించింది. అంత పెద్ద తప్పేం చేసిందా అనుకుంటున్నారా..?ఆండ్రాయిట్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. ఈ మేరకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గూగుల్‌పై ఈ జరిమానా విధించింది.

గూగుల్ అందించే ఉచిత ఇన్ స్టాల్డ్ యాప్స్‌ను తొలగించకుండా నిరోధించడం వంటివి చేయకుండదంటూ కమీషన్‌ సూచించింది. అన్యాయమైన వ్యాపార విధానాలను ఆపాలని సీసీఐ ప్రముఖ ఇంటర్నెట్ కంపెనీని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా తన పనితీరును మార్చుకోవాలని గూగుల్‌ను ఆదేశించినట్లు కమిషన్ గురువారం తెలిపింది.

అసలు మ్యాటర్‌ ఏంటంటే..

మన స్మార్ట్ ఫోన్‌లో ప్రతీ అప్లికేషన్ పని చేయాలంటే.. దానిలో ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్ ) అనేది ఉండాలి. దీనిని గూగుల్ సంస్థ 2005లో కొనుగోలు చేసింది. ప్రతీ మొబైల్ కంపెనీలు కూడా ఇదే ఓఎస్‌ను వాడుతున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు.. గూగుల్ ప్లేస్టోర్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ తదితర అప్లికేషన్లను గూగుల్ కలిగి ఉంది. వీటిని వాడే సమయంలో నియమ నిబంధనల ఆధారంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులకు కూడా నిబంధనల ప్రకారం.. ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. కానీ గూగుల్ పోటీ వ్యతిరేక పద్ధతులను అవలంబింస్తోందంటూ సీసీఐ ఈ జరిమానాను విధించింది.

కొన్ని రోజులుగా గూగుల్ పై యాంటీ ట్రస్ట్ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. సెర్చ్ ఇంజిన్ పేజీతో పాటు.. న్యూస్ కేటగిరీల్లో ఉచితంగా వార్తలను ప్రచురించుకునేందుకు గూగుల్ అవకాశం కల్పిస్తుంది. దానికి ఆయా న్యూస్ పోర్టళ్లలో యాడ్స్ ఇస్తుంది. వీటికి సంబంధించిన ఆదాయాలను సదరు మీడియా సంస్థలకు పంచడంలో గూగుల్ అనైతిక పద్ధతులను అవలంబిస్తోందంటూ ఇటీవల సీసీఐకి ఫిర్యాదులు అందాయి.

డిజిటల్ న్యూస్ పబ్లికేషన్స్, ఇండియన్ న్యూస్ పేపర్ అసోసియేషన్ల నుంచి ఫిర్యాదులు అందినట్లు సీసీఐ పేర్కొంది. వీటితో పాటు.. న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ కూడా సీసీఐకు ఫిర్యాదు చేసింది. యాంటి ట్రస్ట్ సేవలు అనేది గూగుల్ కేవలం భారత్ లోనే కాదు.. యూరప్, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాల్లో కూడా నమోదు కావడం గమనార్హం. దీంతో గూగుల్ పై సీసీఐ పిడికిలి బిగించింది. తాజాగా ఈ జరిమానాను విధించింది. ముందు ముందు ఇంకెన్ని జరిమానాలు విధిస్తుందో..!!

Read more RELATED
Recommended to you

Latest news