ఈ సబ్బు ఖరీదు అక్షరాల రెండు లక్షల ఏడువేలు..ఎందుకంత కాస్ట్ అంటే..!

-

స్నానం చేసే సోప్ ఖరీదు 40రూ వరకూ ఉంటుంది. మహా ఎక్కువ అంటే..ఓ రెండు వందల వరకూ ఉంటుందేమో..కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సోప్ కాస్ట్ ఎంతో తెలుసా అక్షరాల 2.7లక్షలు. ఏంటి ఒంటికి రుద్దుకునే సోప్ కాస్టా, బంగారంతో కానీ చేశారా అని డౌట్ వస్తుంది కదూ. అవును మరీ..ఇది మామూలు సోప్ కాదు..బంగారంతో చేసిన సోప్. ఈ సోప్ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయట. అసలు ఇది ఎందుకు వాడతారు, ఎక్కడ తయారు చేశారో ఇప్పుడు చూద్దాం.

ఎక్కడా తయారు చేస్తారంటే..

లెబానోన్‌లోని ట్రిపోలీకి చెందిన ఒక కుటుంబానికి సబ్బులు ఫ్యాక్టరీ ఉంది.అందులో ఈ రకమైన సోప్స్ తయారుచేస్తారట. 15వ శతాబ్ధం నుంచే ఈ సబ్బులు వాడకంలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అయితే 2013 లో ఈ ఖరీదైన సబ్బులను మొదట తయారు చేశారు. దీనిని ఖతార్ అధ్యక్షుడి భార్యకు బహుమతిగా ఇచ్చినట్లు మీడియా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ లగ్జరీ సబ్బు పేరు ‘ఖాన్‌ అల్‌ సబౌన్‌’ సోప్‌. బాడర్‌ హసీన్‌ అండ్‌ సన్స్‌ కంపెనీ కేవలం చేతులతోనే ఈ సబ్బులను తయారు చేస్తుందట. ప్రత్యేకమైన నూనెలు, సహజ సువాసనలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడంలో ఈ కంపెనీ ప్రసిద్ధి. ఈ కంపెనీ ఉత్పత్తులు కేవలం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రత్యేక షాపుల్లో మాత్రమే దొరుకుతుండటం విశేషం.

బంగారం, వజ్రాల పొడితో తయారీ..

ఈ సోప్ ఎందుకు ఇంత కాస్ట్ అంటే..దీనిని బంగారం, వజ్రాల పొడితే తయారుచేస్తారట. ఒక ఖాన్‌ అల్‌ సబౌన్‌ సబ్బు తయారీకి 17 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, 3 గ్రాముల వజ్రాల పౌడర్‌లో సహజమైన నూనెలు, సహజసిద్ధమైన తేనె, ఖర్జూరం కలిపి తయారు చేస్తారట. చూడ్డానికి అచ్చం జున్ను ముక్కలా ఉంటుందీ ఈ లగ్జరీ సబ్బు. ఒక సబ్బు ఖరీదు అక్షరాల 2 లక్షల 7 వేల రూపాయలు. ఏంటో వంటికి రుద్దుకునే సోప్ లో ఇవన్నీ వేయటం ఏంటి అనే డౌట్ వస్తుంది కదా.

ఈ సోప్ స్పెషాలిటీ ఇదే

ఈ సబ్బు వాడిన వారికి ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కలుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది. అయితే దీనిని రుజువుచేసే ఆధారాలైతే ఏం లేవు.ఇంత డబ్బు పెట్టి దీన్ని వాడేవారు ఉంటారా అనిపిస్తుందా? అలా అనుకుంటే పొరపాటే.. డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్లకు ఇదేం పెద్ద మ్యాటర్ కాదు..ముఖ్యమైన విఐపీలు, సెలబ్రెటీలు మాత్రమే వీటిని వాడుతారట. ముఖ్యంగా దుబాయ్‌లో నివసించే సంపన్న కుటుంబాలు ఎక్కువగా ఈ సబ్బులను వాడుతారని టాక్.

మొత్తానికి స్నానం చేసే సోప్ ఖరీదు అంత ఉందనమాట..పైసలుంటే ఏదైనా చేస్తారు..ఎన్నైనా చెప్తారు కదా..! సరిగ్గా ఆధారాలు కూడా లేవు..కానీ ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత వస్తుందనే చెప్పేసరికి వాడేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news