దేశంలో రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న తరుణంలో అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నాయి కోర్టులు. మరోసారి ఆడపిల్లలపై హత్యాచారం చేయాలి అంటే భయపడే విధంగా మరణశిక్ష విధిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం హత్య కేసులో ఇటీవలే కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
ఈ కేసులోని ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో 18 మంది సాక్షులను కోర్టులో హాజరుపరచగా వాదోపవాదాలు సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి నిందితులకు మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ అత్యాచార కేసులో అమర్ అనే మరో వ్యక్తిని నేరస్థుడిగా గుర్తించినప్పటికీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో అతనిని నిర్దోషిగా ప్రకటించింది.