కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి – వైఎస్ షర్మిల

-

కెసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నేడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల హామీపై కేసీఆర్ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. వైయస్సార్ పాదయాత్రలో పోడు భూములను సమస్యలను కల్లారా చూసారని.. అందుకే ఆయన సీఎం అయ్యాక వెంటనే కోనేరు రంగారావు కమిటీ వేశారని గుర్తు చేశారు.

సీఎంగా వైయస్సార్ 3.30 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే 4 నెలలలో 13 లక్షల పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక అఖిలపక్ష నిరాహార దీక్షకు అనుమతి ఇచ్చేలా చూడాలని కోరుతూ షర్మిల హైకోర్టులో వేసిన పిటిషన్ ను నేడు విచారించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news