హస్తంలో ‘సీఎం’ పంచాయితీ..ముందు గెలవాలిగా.!

-

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఉంది. తెలంగాణలో ఆ పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు..బలమైన కేడర్ ఉంది..కానీ గెలిచే పరిస్తితి కనిపించడం లేదు. దానికి కారణం కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత విభేదాలు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎదగడం లేదు. ఇక ఇలాంటి పరిస్తితుల్లో కూడా నేతలు సి‌ఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. అంటే తెలంగాణ లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే సి‌ఎం పదవి తమకంటే తమకు అని నేతలు పోటీ పడుతున్నారు.

ఓ వైపు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సి‌ఎం రేసులో ఉన్నారు..ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క లాంటి వారు సి‌ఎం రేసులో ఉన్నారు. వీరి మధ్య ఇప్పటికే పంచాయితీ నడుస్తోంది. తాజాగా భట్టి వ్యాఖ్యలతో మరింత రచ్చ లేచింది. తాను ముఖ్యమంత్రి అయితే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తానని,  అయితే ఎన్నికల తరువాతే సీఎం అభ్యర్థిపై నిర్ణయం ఉంటుందని, కానీ తాను కూడా సి‌ఎం రేసులో ఉన్నానని చెప్పుకొచ్చారు. పార్టీ నాయకత్వం సమిష్టిగా ఉందని అనుకుంటున్నట్టు చెప్పారు.

ఇలా సి‌ఎం పదవిని ఆశిస్తున్నట్లు భట్టి చెప్పుకొచ్చారు. అసలు ముందు గెలిచే సీన్ లేదంటే..నేతలు మాత్రం పదవులు కోసం  కొట్టుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ఇటు రేవంత్, ఉత్తమ్ ల మధ్య పెద్ద పంచాయితీ నడుస్తోంది. నల్గొండలో నిరుద్యోగ నిరసన సభ విషయంలో రచ్చ నడుస్తోంది.

ఇలా ఎక్కడకక్కడ పంచాయితీలు చేస్తూ…పార్టీ గెలుస్తుందో లేదో తెలియకుండా..సి‌ఎం పదవులపై మాత్రం ఆశలు పెట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news