ఫ్యాక్ట్ చెక్: వారికి లక్ష రూపాయిలు లోన్.. రూ.1,750 కడితే చాలు..?

-

సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు విపరీతంగా పెరిగిపోయాయి రోజు రోజుకీ టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందుతుందో అలానే మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు ఏదో ఒక పద్ధతిలో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనేక నకిలీ వార్తలు మనకి కనబడుతున్నాయి ఇలాంటి నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే జేబులు ఖాళీ అయిపోతాయి.

సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త తెగ షికార్లు కొడుతోంది. మరి ఆ తాజా వార్తలో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది ఈ స్కీములు వల్ల చాలా మందికి ప్రయోజనం ఉంటోంది. ఈ మధ్యకాలంలో ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్నారు. అలానే ప్రభుత్వ స్కీముల గురించి కూడా నకిలీ వార్తలని ప్రచారం చేస్తున్నారు.

పీఎం ముద్ర యోజన స్కీం కింద లక్ష రూపాయల లోని పొందచ్చని దీని కోసం రూ.1750 చెల్లించాలని ఒక లెటర్ సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది మరి ఆ లెటర్ లో ఉన్నది నిజమేనా లక్ష రూపాయల లోన్ ని పొందొచ్చా అనేది చూస్తే.. అది నకిలీ వార్త అని తెలుస్తోంది ఫైనాన్స్ మినిస్టరీ ఆఫ్ ఇండియా ఇలాంటి లెటర్ ని ఏమి కూడా జారీ చేయలేదు మీరు ముద్ర లోన్ కి ఎంపికయ్యారని ఫోన్లకి మెసేజ్ లు వస్తున్నాయి. అనవసరంగా నకిలీ లింకుల మీద క్లిక్ చేసి మోసపోకండి పైగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి లెటర్స్ ని ఎవరి ఫోన్లోకి కూడా పంపడం లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి ఇది వట్టి నకిలీ వార్త అని చెప్పేసింది

Read more RELATED
Recommended to you

Latest news