ప్రభాస్ ఖాతాలో మరో రెండు సినిమాలు.. 2025వరకు బిజీ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయని తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న రాధేశ్యామ్ తో పాటు సలార్, ఆదిపురుష్, ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మరోటి. ప్రశాంత్ నీల్ సలార్, ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాల చిత్రీకరణలో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ సినిమా ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో మొదలవుతుంది. ఆ సంవత్సరం చివరి నాటికి సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

ఐతే వీటితో పాటు మరో రెండు సినిమాలని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మైత్రీమూవీ మేకర్స్ నిర్మాతగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా ఇంకా దిల్ రాజు నిర్మాతగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా రూపొందనుందట. దాంతో 2024వరకు ఈ సినిమాలతోనే బిజీగా ఉండనున్నాడని సమాచారం. దాంతో కొత్తగా ప్రభాస్ తో సినిమా అని వచ్చే దర్శక నిర్మాతలకు ఇప్పట్లో కుదరదని 2025బిజీగా ఉన్నానని చెబుతున్నాడట.