పాఠశాలలు ప్రారంభం పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..?

-

కరోనా వైరస్ కారణంగా విద్యా సంస్థలు మూత పడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. విద్యాసంస్థలు మూతపడి మూడు నెలలకు పైగానే గడిచిపోతుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థల పునః ప్రారంభానికి ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం పై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.

కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాల ను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి మళ్ళీ పునః ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాజాగా తాడేపల్లి గూడెం లో ని సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 31 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో నాడు-నేడు పనులు పూర్తి కావాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జిల్లా కలెక్టర్లు ఈ పనుల పై రెండు రోజులకు ఒకసారి సమీక్ష చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news