వ్యవసాయ బిల్లుపై కేసీఆర్ తీవ్ర విమర్శలు..!

-

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై సర్వత్ర ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా ఉంది అంటూ ప్రవేశపెట్టిన బిల్లు కారణంగా రైతులకు పూర్తిగా అన్యాయం జరిగే అవకాశం ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు తమ పార్టీ ఎంపీలు ఈ బిల్లుకు పూర్తిగా వ్యతిరేక తెలిపాలి అంటూ ఆదేశాలు సైతం జారీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు కారణంగా రైతులకు న్యాయం జరగడం తప్ప మేలు మాత్రం ఎక్కడా జరగదు అంటూ వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులోని ప్రతిపాదనలు అని రైతులకు అన్యాయం చేస్తూ కార్పొరేట్ వ్యాపారులకు ఎంతో లాభాలు చేకూర్చే విధంగా ఉన్నాయంటూ కేసీఆర్ విమర్శలు చేశారు. పక్క దేశాల రైతులను ప్రోత్సహిస్తూ స్వరాష్ట్ర రైతులను దెబ్బతీసే విధంగా ఈ బిల్లు ఉంది ఆరోపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంతేకాదు రాజ్యసభలో ఈ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేయాలంటూ తమ ఎంపీలకు ఆదేశాలు కూడా జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news