ఆ ఫుడ్‌ ఆర్డర్‌ ఇచ్చిన 30 ఏళ్లకు డెలివరీ అవుతుంది.. తినాలంటే ఓపిక ఉండాల్సిందే..

-

ఆర్డర్‌ ఇచ్చిన ఫుడ్‌ టైమ్‌కు రాకపోతే.. లేట్‌గా తీసుకొచ్చిన డెలవరీ బాయ్‌కు ఇచ్చిపడేసే రోజులివి.. అలాంటి ఘటనలు ఎన్ని చూశాం.. కానీ ఇప్పడు ఆర్డర్‌ ఇస్తే..ఏకంగా 30 ఏళ్లకు డెలివరీ చేస్తారట.. అంత ఓపిక ఎవడికుంది..? అసలు ఆ ఫుడ్‌లో అంత ఏముందు.. అన్ని ఏళ్లు చేయడానికి..? ఇవేగా మీ డౌట్స్..
ఈ ప్రత్యేక వంటకం పేరు ‘క్రోక్విట్స్’. చూడటానికి ఇది సాధారణ ఆలూ కట్లెట్ లా కనిపిస్తుంద. కానీ తినాలంటే మాత్రం ఏళ్లే పడుతుంది. ఈ క్రోక్విట్స్ వంటాకాన్ని కేవలం జపాన్ దేశంలో మాత్రమే తయారు చేస్తారు. చూడడానికి ఇవి ఆలూ కట్లెట్‌లా కనించినా ఇది జపాన్ దేశపు చాలా పాత వంటకం అట. గత 96 ఏళ్లుగా జపాన్ లో ‘ఆషియా’ అనే కుటుంబ సభ్యులు మాత్రమే వీటిని తయారుచేస్తున్నారు.
ఇప్పుడు ఈ వంటకాన్ని ఆషియా ఫ్యామిలీలోని మూడవతరానికి చెందిన షిగేరు నిట్టా అనే వ్యక్తి తయారు చేస్తున్నాడట. దీని తయారీకి స్థానికంగా పండించే బంగాళాదుంపలు, జపాన్ కు చెందిన కోబ్‌ అనే నల్లజాతి పశువుల గొడ్డు మాంసాన్ని ఉపయోగిస్తారట. అయితే ఈ పశువుల్లో 3 సంవత్సరాల వయసున్న పశువుల మాంసాన్ని మాత్రమే వినియోగిస్తారట.
కాగా వీటిని వారంలో కేవలం రెండువందలు మాత్రమే తయారు చేస్తారట. అందుకే వీటిని ఎక్కువగా డిమాండ్‌కు తగినట్లుగా చేయలేకపోతున్నారు. 1996 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ క్రోక్విట్స్‌ను అమ్మడానికి ఆన్లైన్ స్టోర్‌ను ఓపెన్ చేశారు. అప్పటి నుండి వీటిని ఆర్డర్ చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే వీటిని ఆర్డర్‌ చేసిన 30 ఏళ్ల లోపు ఎప్పుడైనా డెలివరీ అవుతుంది. అన్ని సంవత్సరాల తరువాత నిజంగానే డెలివరీ ఇస్తారా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. అయితే 2013 సెప్టెంబర్ 8న ఓ మహిళ ఈ డిష్‌ను ఆర్డర్ చేయగా తాజాగా ఆమెకు డెలివరీ ఇచ్చినట్టు పేర్కొంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అలా అని దీని ధర లక్షల్లో ఉంటుందనుకుంటారేమో.. రూ.1600 మాత్రమే.. అయినా మరీ 30 ఏళ్లు పట్టడం ఏంటండీ విడ్డూరం కాకపోతే.!

Read more RELATED
Recommended to you

Latest news