తొలి ఏకాదశి సందర్భంగా రేపు ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఉండనుంది. స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. జులై 17న హిందువుల తొలి ఏకాదశి, ముస్లింల మొహర్రం సందర్భంగా సెలవు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి.. తొలి ఏకాదశి పండుగ.. హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు.. అంతేకాదు, హిందువులకు తొలి పండుగను ఈ రోజునే జరుపుకుంటారు. ఈరోజు భక్తులు విష్ణుమూర్తిని పూజించి దేవాలయాలను సందర్శిస్తారు. ఉపవాస వ్రతం పాటించి ఎంతో భక్తి శ్రద్దలతో భగవాన్మామస్మరణ చేస్తారు.
అలాగే, మోహరం ఇస్లామిక్ క్యాలెండర్లో ఇది మొదటి నెల. ఈ మాసంలో ముస్లింలు సంతాపం తెలుపుతారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హుసేన్ ఇబ్న్ అలీ బంధువులతో కలిసి అమరుడైన రోజని ముస్లిం పెద్దలు చెబుతారు.