ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సారి వెనకాడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవో నెంబర్ 2ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ జీవో నెంబర్ 2 ను నిలిపి వేయాలని హై కోర్టు కేసు నడుస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న సర్పంచులు, కార్యదర్శులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగ ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ జీవో నెంబర్ 2 ప్రకారం రాష్ట్రంలో ఉన్న అన్నీ గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు, కార్యదర్శులకు ఉన్న అధికారాలన్నీ కూడా వీఆర్వో లకు చెందుతాయి.
ఈ జీవో నెంబర్ 2 తీసుకు వచ్చిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. అంతే కాకుండా ఈ జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి పూర్తిగా విరుద్ధమని ఏపీ హై కోర్టులో పిటిషన్ కూడా దఖాలు చేశారు. దీంతో హై కోర్టు ఈ జీవో నెబంర్ 2 పై విచారణ జరిపి.. సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు మరో సారి విచారణ జరుపుతున్నారు. జీవో నెంబర్ 2 హై కోర్టు లో విచారణ జరుపుతున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జీవో నెంబర్ 2 ఇక నుంచి ఉండదు. కాబట్టి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, కార్యదర్శుల అధికారాలు అలాగే ఉండనున్నాయి.