ఏ ఇద్దరి మధ్య అయినా బంధం ( relationship )గట్టిగా నిలబడాలంటే వారిద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అవతలి వారిలో కలిగించడానికి మీరు కొన్ని అలవాట్లని అలవర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఎక్కువ ఆశించవద్దు
ఏ బంధంలో అయినా ఎక్కువ ఆశించడం మొదటికే మోసం తీసుకువస్తుంది. అవతలి వారి నుండి ఏమీ ఆశించకపోవడమే అన్నింటికన్నా ఉత్తమమైనది. మీరు ఆశించింది అవతలి వాళ్ళలో లేదని తెలిసినపుడూ బాధపడతారు. అందుకే డోన్ట్ ఎక్స్పెక్ట్ టూమచ్.
ఎక్కువ ఇవ్వండి
ఆశించవద్దని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇవ్వడం నేర్చుకోవాలి. ఇస్తూ వెళ్ళండి. అవతలి వారి మీద ప్రేమని, అనురాగాన్నీ, మమతనీ ప్రకటించే వాటిని ఇస్తూ పోండి. ఇది బంధాలను గట్టిపర్చడంలో బాగా ఉపయోగపడతాయి.
తిరిగి ఆశించకు
మీరిచ్చారు కదా అని అవతలి వారు కూడా మీకు ఇవ్వాలని అనుకోవద్దు. ఒక్కోసారి మీకు ఇవ్వడానికి వారి దగ్గర ఏమీ ఉండకపోవచ్చు. అది మిమ్మల్ని బాధపెట్టవచ్చు. సో.. అందుకే ఇవ్వండి. కానీ తిరిగి ఆశించకండి.
సమాచారం ఇస్తూ ఉండండి
ఎక్కడికైనా డిన్నర్ వెళ్దామని అనుకున్నపుడు అనివార్య కారణాల వల్ల మీరు రాలేకపోతే ఆ విషయాన్ని అనుకున్న సమయాని కంటే ముందుగా వెల్లడించడం ఉత్తమం.
మీ భావాలను తెలుసుకోనివ్వండి
మీ భావాలను దాచిపెట్టవద్దు. వారితో పంచుకోండి. అప్పుడే మీరు తమవారు అన్న ఫీలింగ్ వారికి కలుగుతుంది.
సహాయం చేయండి
అవతలి వారు బాగా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మీకు చేతనైన సహాయం చేయండి. దానివల్ల తమకి మీరున్నారన్న ఫీలింగ్ వస్తుంది.
కమ్యూనికేషన్
అవతలి వారికి బాగా అర్థమయ్యే విధంగా మీ ప్రేమని తెలియబర్చండి.
చెప్పుడు మాటలు కట్టిపెట్టండి
ఎవరో చెప్పే విషయాలను పట్టించుకోవద్దు. బంధాలను బద్దలు కొట్టేవి ఇవే. అందుకే నిజానిజాలు తెలుసుకోకుండా అవతలి వారి మీద నిందలు వేయవద్దు.