ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన హెలికాప్టర్ వెనుదిరిగింది. వాతావరణం మార్పు కారణంగా ల్యాండింగుకు అనుకూలించగా చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వెనుదిరిగింది.

కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు బయలుదేరారు. అయితే వాతావరణం అనుకూలించగా తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు హెలికాప్టర్ చేరుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ ప్రత్యేక విమానంలో రాజమండ్రి వెళ్ళబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.