ఆఫర్ల కోసం హీరోయిన్లు ఇలా దిగజారుతున్నారేంటి గురూ…?

-

సినిమాల్లో ఆఫర్ల కోసం హీరోయిన్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి సినిమా పరిశ్రమలో అవకాశాలు రాకపోతే మాత్రం వాళ్ళ కెరీర్ కాదు జీవితం ఇబ్బంది పడుతుంది. రంగుల ప్రపంచంలో ఒక వెలుగు వెలిగినన్ని రోజులు బాగానే ఉంటుంది గాని తేడా వస్తేనే నిజ జీవితంలో కూడా సినిమా కనపడుతుంది. అందుకే చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు ఆఫర్ల కోసం చాలా సంకేతాలు ఇచ్చేస్తున్నారు.

హాలివుడ్ కి వెళ్ళిన ప్రియాంక చోప్రా పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే ఆమె హాలివుడ్ ఆఫర్ల కోసం ఏ స్థాయిలో ప్రయత్నం చేస్తుందో అర్ధమవుతుంది. చివరికి తనకంటే పదేళ్ళ చిన్న వాడిని పెళ్లి చేసుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన కాజల్ అయితే బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి గాను ఈవెంట్ ఫంక్షన్స్ లో వేసుకునే దుస్తులూ చేసే ఎక్స్ పోజింగ్ చాలా దారుణంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

ఇక యాడ్ ల కోసం దిశా పటాని అనే బాలివుడ్ హీరోయిన్ మరింత దిగజారిపోతుంది. సినిమాల్లో అవకాశం ఇవ్వండి మేము చూపించడానికి రెడీ అంటున్నారు. ఏదైనా ఇతర రాష్ట్రాల్లో ఫంక్షన్స్ జరుగుతుంటే కాస్త వింతగా వెళ్తున్నారు. బాలివుడ్ కి మాత్రమే ఉండే ఈ జబ్బు దక్షినాది సినిమాలకు కూడా అంటుకుంది. ప్రియాంక చోప్రా ,కాజల్ ,దిశా పటాని,బాలీవుడ్ ,హీరోయిన్లు దాదాపు అన్ని బాషలలో ఈ పరిస్థితి ఉంది అనేది వాస్తవం.

నిర్మాత దర్శకులను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కథలో విషయం ఉండాలిగాని తాము చూపించడానికి సిద్దం అంటున్నారు హీరోయిన్లు. బాలివుడ్ అవకాశాల కోసం టాలివుడ్ హీరోయిన్లు, హాలివుడ్ సహా ఇతర భాషల అవకాశాల కోసం బాలివుడు హీరోయిన్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news