శాసన మండలి రద్దు వ్యవహారం ఏమో గాని ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. రాజకీయంగా ఈ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతుంది. ఎన్ని విమర్శలు చేసినా జగన్ మాత్రం మండలి రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకుని ఆ విధంగా ముందు అడుగు వేసారు. ఇక ఇప్పుడు కేంద్రం చేతిలో బిల్లు ఉంది.
కేంద్రం ఆమోదిస్తే మండలి రద్దు జరుగుతుంది. ఇక టీడీపీ ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసారు. “చంద్రబాబు కష్టాలు ఎల్లో మీడియాకు జీవన్మరణ సమస్యలై పోయాయి. కౌన్సిల్ రద్దుపై సిఎం జగన్ గారి ప్రకటన వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్సీల కదలికలపై కుల మీడియా నిఘా పెట్టింది.
ఇళ్ల చుట్టూ తమ ప్రతినిధులను మోహరించి బాబుకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. సిఎం జగన్ గారు విలువలకు కట్టుబడిన మొండి మనిషి కాబట్టి సరిపోయింది. గేట్లు తెరిచుంటే ఈ పాటికి అంతా జంప్ అయ్యేవారే. మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆఖరికి మాలోకాన్ని కూడా పంపించి కేసుల నుంచి తప్పించుకోవాలని చూసేవాడు చంద్రబాబు.” అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసారు.