ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు చెయ్యాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ తీర్మానాన్ని మంత్రి వర్గం ఆమోదించింది. ఇక అసెంబ్లీలో ఈ బిల్లుని ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టగా చర్చ జరుగుతుంది. ఈ నేపధ్యంలో మంత్రులు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజలు తిరస్కరించిన వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని ఆరోపించారు.
ఇంగ్లీష్ మీడియం బిల్లుని మండలిలో అడ్డుకునే ప్రయత్నం చేసారని, ముందెన్నడూ లేని దుష్ట సాంప్రదాయం నడుస్తుందని మంత్రులు ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని చేతబడులు చేసినా ముఖ్యమంత్రి జగన్ కాలిగోరు కధపలేరని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం తో ఒక్కసారిగా విపక్ష తెలుగుదేశం షాక్ అయింది. ఊహించని విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఒకసారి మండలి చరిత్ర చూస్తే, 1968 లో మండలిని అమలులోకి తీసుకొచ్చారు. 1968 జులై 8 ఆవిర్భావం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో 1985 రద్దు చేయగా ఏడాదికి పైగా సమయం పట్టింది. 1989 లో చెన్నా రెడ్డి పునరుద్దరించే ప్రయత్నం చేసినా సరే ఫలించలేదు. ఆ తర్వాత 2004 లో వైఎస్ పునరుద్దరణకు శ్రీకారం చుట్టారు. 2007 మార్చ్ 30న మండలి పునరుద్దరణ జరగగా, 2020 జనవరి 27 జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.