ఫిట్నెస్ లో హీరోలనే మించిపోయిన ఆ హీరో భార్య..

-

వితికా షేరు.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. బిగ్ బాస్ తో మరింత ఫేమస్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్న ఈ భామ.. తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఇందులో తన ఫిట్నెస్ తో హీరోలనే మించిపోతూ కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కన్నడ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా అడుగుపెట్టిన వితీకా.. ప్రేమించే రోజుల్లో అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత ఝుమ్మంది నాదం, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ పేరు సంపాదించుకుంది.

పడ్డానండి ప్రేమలో మరి సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించాడు వరుణ్ సందేశ్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి తర్వాత పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో పెళ్లి చేసుకున్న ఈ జంట తర్వాత తమ కెరియర్ను సక్సెస్ఫుల్గా కొనసాగిస్తూ వస్తున్నారు. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో నటించని వితిక సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానుల్ని అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వితికా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ వస్తుండగా తాజాగా ఫుల్ ఫిట్నెస్ లో కనిపిస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంది.. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లంతా ఫిట్నెస్ లో ఈ హీరోయిన్ హీరోలనే మించిపోయింది కదా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..

ఆ మధ్య వరుసగా సినిమాలు చేసిన వితికా షేరు.. వివాహం తర్వాత మాత్రం పెద్దగా అవకాశాలను దక్కించుకోలేదు

ప్రస్తుతం ఈ భామకు సినిమాల్లో అవకాశాలు తగ్గినట్టు కనిపిస్తూ వస్తుండగా 2 ఏళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరి ఏ సినిమాకు సైన్ చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news