హోళీ వేడుకలు ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారో తెలుసా?

-

దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ర్టాల్లో ఈ పండుగను చేసుకునే విధానం తెలుసుకుందాం…

కాశ్మీర్‌లో

నిత్య అగ్రిహోత్రంగా ఉండే కాశ్మీర్‌లో పిల్లా పాపల నుంచి దేశరక్షణకు సరిహద్దు పహారాగా ఉండే సైనికుల వరకు అందరూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకొంటారు. ఆటపాటలతో రంగు నీటిని ఒకరిపై మరొకరు చల్లుకుంటారు.

ఉత్తరప్రదేశ్

మథురకు దగ్గరగా ఉండేవారు ఈ రంగుల పండుగను విచిత్రంగా చేస్తారు. ఇక్కడ మహిళలు మగవారిని లాఠీలతో కొడుతారు. దీన్నే వారు లఠ్‌మార్ హోళీ అంటారు.ఈ ప్రాంతాలలో నెలరోజుల ముందు నుంచే హోళీకి సన్నాహాలు చేస్తారు.

హర్యానా

కరోర్ మార్ అని నిర్వహిస్తారు. వదినలు, మరదలు బావలను,మరిదిలను కొట్టడం. కలిసి మెలిసీ ఆనంద డోలికల్లో ఈ పండుగను జరుపుకొంటారు.

మణిపూర్

ఇక్కడ ఆడవారు మగవారిపై రంగులు చల్లుతారు. అయితే వారికి మగవారు తప్పక కానుకలు ఇవ్వాల్సిందే. వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఒడిశా

ఒరిస్సాలో జగన్నాథస్వామి దేవాలయంలో శ్రీకృష్ణుడు,రాధా విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు చేసి హోళీ ఉత్సవాలను ప్రారంభిస్తారు.

గుజరాత్

మంటలు వేసి దాని చుట్టూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతారు. అందరూ పెద్ద మైదానం లాంటి ప్రదేశం వద్ద గుమికడి సామూహికంగా మంటలు వేస్తారు. ఈ మంటల్లో చెక్కసామానులన్నీ తీసుకొచ్చి వేస్తారు.

మహారాష్ట్ర

ఇక్కడ హోళీ ముందురోజు హోళీక (రాక్షసి) దిష్టిబొమ్మను దహనం చేస్తారు. మంటలకు ప్రత్యేకంగా తయారుచేసిన స్వీట్లను సమర్పిస్తారు.

ఇక పలు దేశాల్లో బోనిఫైర్ కింద మంటలను వేసి చుట్టూ తిరుగుతూ డ్యాన్స్‌లను చేయడం విదితమే. కానీ మనవారు ఆ నృత్యాలను మరిన్ని కార్యక్రమాలను జోడించి ప్రకృతిని ఆరాధిస్తూ పరవశిస్తూ చేసుకునే పండుగే ఈ హోళీ. విలాసం, వినోదం ఉన్న పూర్ణిమనే హేలికా పూర్ణిమా అని అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news