ఆ హోటల్ మొత్తాన్ని ఉప్పుతో నిర్మించారట..అమేజింగ్..

-

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి..కొన్ని వింతలు ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఆవిర్భవిస్తే,మరి కొన్ని మానవ నిర్మితాలు..ఇలాంటి ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.అవి నిజమైనవే అనే విధంగా నిర్మిస్తున్నారు.కొన్ని మానవ నిర్మిత వింతలను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..అలాంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అదొక భారీ నిర్మాణం, కేవలం ఉప్పుతో దాన్ని నిర్మించారు.సాధారణంగా మట్టితో నిర్మిస్తేనే ఈ రోజుల్లో భవనాలు నిలవడం లేదు. అలాంటిది ఒక పెద్ద హోటల్‌ను ఉప్పుతో బిల్డ్ చేశారు. అయితే ఉప్పు అన్న తర్వాత కరిగిపోదా అనే అనుమానం అందరికీ కలగకమానదు. అలా జరగకుండా ఉండేందుకు హోటల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విషయాన్నికొస్తే.. బొలీవియాలో ‘పాలాసియో డి సాల్‌’ అనే హోటల్‌ను పూర్తిగా ఉప్పుతో కట్టారు. అందరూ హోటల్‌కు ఫుడ్ తినడానికి వెళతారు కానీ ఈ హోటల్ కి మాత్రం చూడ్డానికే ఎక్కడెక్కడి నుంచో ప్రజలు భారీగా వస్తున్నారు.

ఈ హోటల్‌లోని గోడలు, పైకప్పు, మిగతా ఫర్నిచర్ అంతా కూడా ఉప్పుతో తయారు కావడం విశేషం. ఈ భవనంలో 12 గదులు, డైనింగ్‌ హాల్స్, గోల్ఫ్‌కోర్స్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సౌకర్యాలు కూడా ఉప్పు తోనే తయారు చేశారు. దీనివల్ల ఇవన్నీ కూడా తెల్లగా మెరుస్తూ చూపరులను కట్టిపడేస్తాయి..బొలీవియాలోని ఒక ఎడారిలో “సలార్‌ డి ఉయునీ” ఉప్పు దొరుకుతుంది. ఈ ఉప్పును చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. అయితే ఉప్పు ఎడారిని వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ హోటల్ నిర్మించారట. ఉప్పు కరిగిపోకుండా ఉప్పు ఇటుకలను ఫైబర్‌గ్లాస్‌తో చాలా కట్టుదిట్టంగా ప్యాక్ చేశారు. ఇందులోకి నీరు గాలి వంటివి చొరబడవు. అందుకే నొప్పితో నిర్మితమైన ఈ హోటల్ చాలా దృఢంగా ఉంటుంది..ఈ సీజన్ కు తగ్గట్లు ఆ విధంగా ఈ కట్టడంను నిర్మించారు..అందుకే దీన్ని సందర్షించె వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news