బైక్‌పై వెళ్తూ సడన్‌గా గాల్లో ఎగిరి కిందపడిన బైకిస్ట్..కారణం ఏంటంటే..

-

రోడ్డుపై వెళ్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. అవతలి వారి నిర్లక్ష్యం వల్ల మనం చిక్కుల్లో పడుతుంటాం.. దాదాపు రోడ్డుప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. ఏం అవుతుందిలే అన్న ధోరణితో డ్రైవింగ్‌ చేసి వాళ్లు ప్రమాదంలో పడటమో లేక, ఎదుటివారిని ప్రమాదానికి గురిచేయడమో చేస్తారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. వాటినే ట్రాఫిక్‌ పోలీసులు చూపించి..జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పిస్తుంటారు.. తాజాగా తమిళనాడులో ఓ భయానక యాక్సిడెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తూత్తుకుడిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు నుంచి వేలాడుతున్న తాడు.. అపోసిట్‌లో వస్తున్న బైకర్ మెడకు చుట్టుకుంది. దీంతో అతను అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు.. అతనికి సాయమందించారు. అదృష్టవశాత్తు బాధితుడు స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు.
ఈ ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష‍్యమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. లోడుపై నుంచి తాడు వేలాడుతున్నా.. దాన్ని పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే వాహనాన్ని వేగంగా నడిపాడు.. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన బైకర్‌ మెడకు అది చుట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వీడియో చూస్తే.. మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో బాగా తెలుస్తుంది. రోడ్డుపై వెళ్లేప్పుడు పెద్ద పెద్ద వాహనాలకు బాగా దగ్గరగా వెళ్లకపోవడం ఉత్తమం. ముఖ్యంగా లారీలు, బస్సుల మధ్యలోంచి, వాటి పక్కన నుంచి ఎక్కువ సేపు వెళ్లకూడదు..హెల్మెట్‌ వాడకం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి. చాలామంది.. హెల్మెట్‌ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని, హెయిర్‌ స్టల్‌ పాడవుతుందని పెట్టుకోరు. ఉడే జుట్టుకన్నా..పోయే ప్రాణం చిన్నదంటారా.. అయినా మీకు అంత బాధగా ఉంటే.. కర్ఛీఫ్తో ముందు తలను చుట్టుకోని ఆపై హెల్మట్‌ ధరిస్తే ఎలాంటి సమస్యా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news