ఆ కుక్కను రూ.20 కోట్లు పెట్టి కొన్న కన్నడ నటుడు..!!

-

కుక్కలను ఇష్టపడేవాళ్లు.. నచ్చిన బ్రీడ్‌ కోసం ఎంతైనా ఖర్చుపెడతారు.. మాములుగా ఎంతైనా అంటే.. పదివేలు, మహా అయితే లక్ష.. మనలో కూడా చాలమంది కుక్కలను పెంచుతుంటారు.. మీరు మీ కుక్కను ఎంత పెట్టి కొన్నారు..? కానీ ఇక్కడ కన్నడ నటుడ రూ.20 కోట్లు పెట్టి కుక్కను కొనుక్కున్నాడు..ఏంటి షాక్‌ అయ్యారా..? బెంగళూరులోని కడబామ్స్ కెన్నెల్స్ (Cadabom’s Kennels) ఓనర్, ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్.. మరోసారి అరుదైన కుక్కను కొన్నారు. ఈయన ఇదివరకు కూడా అరుదైన జాతి కుక్కల్ని కొన్నారు. తాజాగా కొన్నది కాకాసియన్ షెపెర్డ్. అంతలా ఈ కుక్కలతో ఏం ప్రత్యేకత ఉంది..?
ఇలాంటి కుక్కలు ఇండియాలో అత్యంత అరుదుగా ఉన్నాయి. ఇవి టర్కీ, ఆర్మేనియా, సర్కాస్సియా, జార్జియాలో కనిపిస్తాయి. ఇవి కాపలా కుక్కలుగా పనిచేస్తాయి. ఇలాంటి కుక్కల్ని కొనే సతీష్.. కుక్కల్ని పెంచే సెలబ్రిటీగా పేరుపొందారు. ఈయన కన్నడ నటుడు.. అరుదైన కుక్కల్ని పెంచడం అంటే ఇతనికి బాగా ఇష్టం. అందుకే మనీ ఎంతైనా సరే వెనకాడరు.
తాజాగా కొన్న కుక్కకు ధైర్యం, నమ్మకం ఎక్కువట… దేనికీ భయపడదు. అత్యంత తెలివైన జాతి కుక్క. ఇవి చాలా పెద్దదిగా ఉంటుంది. దీన్ని చూస్తేనే భయం వేస్తుంది.. ఎక్కువ బొచ్చుతో ఉంటాయి. ఈ కుక్కలు 10 నుంచి 12 ఏళ్లు బతుకుతాయి. అమెరికా కెన్నెల్ క్లబ్ ప్రకారం.. కకాసియన్ షెపెర్డ్స్‌ని… శతాబ్దాలుగా.. ఆస్తుల రక్షణ కోసం వాడుతున్నారని తెలిసింది..
రోడ్డున పోయే అగంతకుల నుంచి ఇవి రక్షణ కల్పిస్తున్నాయి. ఓనర్ల పెంపుడు జంతువుల్ని కాపాడుతున్నాయి. దొంగలతో పాటూ.. తోడేళ్లు, కోయోట్స్ వంటి వాటి నుంచి కూడా ఈ జాతి కుక్కలు రక్షణ కల్పిస్తున్నాయి. సతీష్ ఇదివరకు కొరియా దోస మస్తిఫ్స్‌ని రూ.1 కోటి పెట్టి కొన్నారు. అలాగే అలస్కాన్ మాలామ్యూట్‌ని రూ.8 కోట్లకు, టిబెటన్ మస్తిఫ్‌ని రూ.10 కోట్లకు కొన్నారు. ఇప్పుడు కొన్న కుక్క రూ.20 కోట్ల.. కడబామ్ హేడెర్ అనే పేరు పెట్టిన సతీష్.. అది 1.5 ఏళ్ల వయసు కలిగివుందని పేర్కొన్నారు. దీన్ని హైదరాబాద్‌కి చెందిన కుక్కల పెంపకందారు నుంచి కొన్నట్లు తెలిసింది.
ఈమధ్య ఈ కుక్క.. త్రివేండ్రమ్ కెన్నెల్ క్లబ్ ఈవెంట్, క్రౌన్ క్లాసిక్ డాగ్ షోలో పాల్గొంది. బెస్ట్ డాగ్ బ్రీడ్ కింద 32కి పైగా మెడల్స్ గెలుచుకుందట.. ప్రస్తుతం హేడెర్.. సతీష్ ఇంట్లోనే ఉంటోంది. అది ఫ్రెండ్లీగా ఉందనీ.. బాగా పెరుగుతోందని ఆయన తెలిపారు. దాన్ని నవంబర్‌లో బెంగళూరు ప్రజలకు పరిచయం చేస్తానన్నారు. అంతకంటే ముందుగా.. ఫిబ్రవరిలో జరిగే మెగా ఈవెంట్‌లో పాల్గొంటే.. అప్పుడే అందరికీ పరిచయం చేస్తానని తెలిపారు. సతీష్ దగ్గర ఇదే జాతికి చెందిన రెండు కుక్కపిల్లలు ఉన్నాయి. వాటిని రూ.5 కోట్లకు కొన్నారు. వాటిని తనదగ్గరే ఉంచుకొని పెంచుతానని అంటున్నారు. మొత్తానికి కోట్లు ఖర్చుపెట్టి సతీష్‌ ఇలా కుక్కలను కొంటున్నాడు.. ఇది మనలాంటి వాళ్లకు వింతగా అనిపించినా.. వాళ్లకు కామన్‌..! ఏమంటారు..?

Read more RELATED
Recommended to you

Latest news