విశాఖలో సరికొత్త మోసం…!

-

విశాఖలో సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అజిత వాజెండ్ల చెప్పిన వివరాల ప్రకారం… నగరంలో ఫేక్ ఫారెన్ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసామని ఆమె చెప్పారు. విదేశీ రంగు రాళ్లు పేరుతో ఏజెన్సీ నుండి తెచ్చిన రంగురాళ్లను విక్రయించేందుకు మోసగాళ్ల పథకం గుర్తించామని వివరించారు. వేర్వేరు కేసుల్లో ముఠాకు చెందిన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు.

నిందితుల్లో తిరుపతి, విజయనగరం కు చెందిన వారు ఉన్నారని ఆమె వివరించారు. విలువైన టర్కీ కరెన్సీ ని తక్కువ ధరకే ఇస్తామని ఆశ చూపించారు అని, నిందితుల వద్ద నుండి రూ. 45 కోట్ల విలువైన ఫేక్ టర్కీ కరెన్సీ, రూ. 70 వేల విలువ చేసే రంగు రాళ్లు స్వాధీనం చేసుకున్నట్టు మీడియాకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news