హైదరాబాద్ లో దారుణ హత్య.. మెట్రో స్టేషన్ కిందే !

హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది. హైదరాబాడ నారాయణగూడ మెట్రో స్టేషన్ కింద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యను చూసిన మెట్రో ప్రయాణికులు కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు నారాయణగూడ పోలీసులు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు పోలీసులు.

మద్యం మత్తులో వైట్నర్ ల కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు. ఈ గొడవలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని తలపై బండ రాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు ప్రాధమిక విచారణలో తేలింది. ఈ మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు చంపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ విషయం మీద మరింత సమాచారం అందాల్సి ఉంది.