ఎంతమంది పిల్లలు ఉంటే అంత ధనవంతులు: చంద్ర బాబు

-

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం ‘రా కదలి రా’ సభలో చంద్రబాబు మాట్లాడుతూ…. మేము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15వేల చొప్పున ఇస్తాం అని అన్నారు. ఓపిక ఉండి నలుగురిని కంటే రూ.60 వేలు వస్తాయి అని తెలిపారు. ఎంతమంది పిల్లలుంటే అంత ధనవంతులవుతారు. చాలా దేశాల్లో జనాభా తగ్గి ఇబ్బందులు పడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. మన పిల్లల్ని బాగా చదివిస్తే తెలుగు జాతి గర్వించేలా ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఆయన అన్నారు.

యువత రోడ్డుపైకి వచ్చి టీడీపీ-జనసేన తరఫున ప్రచారం చేయాలని ,యువతకు బంగారు భవిష్యత్తు అందించే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ‘ వైసీపీ పాలనలో ఉద్యోగాలు లేక అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి అని అన్నారు. ప్రజల్ని పేదరికంలోకి నెట్టేసిన కలియుగ భస్మాసురుడు జగన్ని ఓటుతో అంతం చేయాలి అని పిలుపునిచ్చారు. జగన్ నాటకాలతో పేదలను మోసగిస్తున్నాడు. ఊరికో ప్యాలెస్ ఉన్న జగన్ తాను పేదనని చెబుతున్నాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news