మరో యంగ్ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మోస్ట్ క్రేజీ సీత..!

-

సీతారామం సినిమాతో తెలుగులో సీతగా మంచి పేరు దక్కించుకున్న ఉత్తరాది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సీతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే సీతారామం సినిమా తర్వాత గాస్త గ్యాప్ తీసుకున్న ఈమె నాని హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటించేందుకు కమిట్ అయింది అని వార్తలు వినిపించాయి . ఆల్మోస్ట్ నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ ఫిక్సయిందని.. తప్పకుండా వీరిద్దరిది కాంబో హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా నమ్మకంగా ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు మరోవైపు మృణాల్ ఠాగూర్ నాని తో పాటూ మరో యంగ్ హీరో చేయి పట్టుకుందనే వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మెగా హీరో వరుణ్ తేజ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ నటించబోతోంది. సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్ తో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈసారి మొదట నానితో ఆ తర్వాత మెగా హీరోతో నటించేందుకు సిద్ధమయిందని సమాచారం. పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మృణాల్ కు ముందు ముందు తెలుగులో మరిన్ని ఆఫర్లు వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే మహేష్ బాబు సినిమాలో కూడా ఈమె నటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా కనీసం మరికొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే మహేష్ బాబుకు జోడిగా మృణాల్ నటించబోతోందని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఈమె క్రేజ్ భారీగా ఉంది. కాబట్టి ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఇలాగే అవకాశాలు రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news