ఇది కారా.. ఊసరవెళ్లా.. 240 రంగులు మార్చుతుందట..

-

రంగులు మార్చే ఊసరవెళ్లిని చూసే ఉంటా. అయితే..తాజాగా బీఎండబ్ల్యూ విడుదల చేసిన కొత్తకారు కూడా 240 రంగులు మార్చుతుంది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ అమెరికాలోని లాస్ వేగాస్ లో జరుగుతున్న సీఈఎస్ ఈవెంట్ లో ఓ కొత్త కారును ప్రదర్శించింది. ఆ కారును చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎందుకంటే, ఆ కారు 240 రంగులు మార్చింది. ఈ కారు పేరు ఐ విజన్ డి. పరిస్థితులను బట్టి రంగులు మార్చే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించారు. డ్రైవర్ ఏ మూడ్ లో ఉన్నాడన్నది పరిగణనలోకి తీసుకుని ఈ కారు రంగులు మార్చేస్తుంది. అందుకోసం ఈ-ఇంక్ టెక్నాలజీ ఉపయోగించారు.

ఈ ఐ విజన్ డి కారును భారత్ లోనూ తీసుకువచ్చేందుకు బీఎండబ్ల్యూ ప్రణాళికలు రచిస్తోంది. అయితే, రెండేళ్ల తర్వాతే ఇది భారత్ లోకి రానుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉన్న ఈ కారును త్వరలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు బీఎండబ్ల్యూ సన్నద్ధమవుతోంది. ఈ కారులో మరో కొత్త టెక్నాలజీ కూడా ఉంది. ఓ సినిమా తెరపై ప్రదర్శించినట్టుగా, కారు విండ్ షీల్డ్ పై డిజిటల్ ఫార్మాట్ లో డ్రైవింగ్ డేటాను పొందే వీలుంది. కారు వేగం, మైలేజి, నేవిగేషన్ వంటి అంశాలను కారు విండ్ షీల్డ్ పై చూడొచ్చట.

Read more RELATED
Recommended to you

Latest news