నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో బాలయ్య స్టైల్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పంచకట్టులోనూ బాలకృష్ణ స్టైలిష్ గా కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ ఈ మూవీలో బాలయ్య స్టైలింగ్, జై బాలయ్య పాట ఎందుకు పెట్టారో వంటి ఆసక్తికర విషయాల గురించి చెప్పారు.
” జై బాలయ్య డైలాగ్ ఓ ట్రెండ్ అయిపోయింది. అందుకే ఆ డైలాగ్ పెట్టాను. జై బాలయ్య పాట విషయానికొస్తే.. ఆ పదం ఓ ఎమోషన్ అయిపోయింది. అందుకే ఆ పాట ఉంటే ఓ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది నేను తమన్ అనుకున్నాం. అందుకే చేశాం. అది వర్కౌట్ అయింది. ప్రేక్షకుల్ని ఆదరిస్తారని అనుకున్నాం. ఆదరించారు.” అని గోపిచంద్ అన్నారు.
“అటు మాస్ థియేటర్లో ఇటు మల్టీప్లెక్స్‌లో సినిమా చూశాను. మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అసాధారణమైన రెస్పాన్స్ వచ్చింది. నా ఫోన్లు ఇప్పటివరకు మోగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ నుంచి చాలా మంది కాల్స్ చేశారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాగా చూపించావని అంటున్నారు. బాలయ్య కాస్ట్యూమ్స్ విషయానికొస్తే ఆయన క్యారెక్టర్‌కు బాగా డెప్త్ ఉంటుంది. డిజైన్ చేసేటప్పుడే స్కెచెస్ వేయించాను. ఆ తర్వాత బాల్యయకు అది చూపించాను. అయితే మొదట నా మనసులో బ్లాక్ షర్ట్ వేద్దాం అన్నప్పుడు బాలయ్యను అడగలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ అప్పుడే బాలయ్య కూడా తమ మనసులో బ్లాక్ ఉందని చెప్పారు. దీంతో నేను కూడా అదే అనుకున్నా సార్ అంటూ డిజైన్ చూపించాను. ఇక యంగ్ లుక్ బాలయ్య కోసం భాస్కర్ డిజైనర్. ఆయన ప్రభాస్‌కు పర్సనల్ డిజైనర్.” అని గోపిచంద్ అన్నారు.