ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ సామ్ కరణ్ రికార్డులు బ్రేక్ చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించారు సామ్ కరణ్. ఇప్పటివరకు సౌత్ఆఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా.. ఈ రికార్డును సామ్ కరణ్ చెరిపేశారు. ఇతన్ని రూ. 18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
కామెరున్ గ్రీన్ ని రూ. 17.50 కోట్లకి ముంబై ఇండియన్స్, బెన్ స్టోక్స్ ని చెన్నై సూపర్ కింగ్స్ 16.25 కోట్లు, మయాంక్ అగర్వాల్ ని హైదరాబాద్ 8.25 కోట్లు, హోల్డర్ ని రాజస్థాన్ రాయల్స్ 5.75 కోట్లు, కెన్ విలియమ్స్ అన్ని గుజరాత్ 2 కోట్లకి సొంతం చేసుకున్నాయి.