ఆమ్‌ఆద్మీ పార్టీకి షాకిచ్చిన ఆ రెండు రాష్ట్రాల ప్రజలు

-

హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఈ ఎన్నికల ఫలితాలు చీపురు పార్టీకి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఆ రెండు రాష్ట్రాల్లో ఆప్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినా.. కేజ్రీవాల్ ఎంత మంచి ప్రసంగాలు చేసినా ఓటర్లు ఆ పార్టీని పట్టించుకోలేదు. దీంతో రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేక పోయింది. ఈ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన ఆప్ పార్టీ ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది.

కనీసం ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.హర్యానా,జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు ఆప్ పార్టీకి ఎదురుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హర్యానాలో తొలుత కాంగ్రెస్‌తో పొత్తు కోసం ప్రయత్త్నించినా సీట్ల పంపకంలో తేడా రాగా చీపురు పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ ఒంటరిగా పోటీ చేసింది. ఓట్ల చీలిక కారణంగా పరోక్షంగా ఎన్డీఏ కూటమికి ప్లస్ అయ్యిందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version