ఉత్తరప్రదేశ్‌లో అల్లర్లకు పాల్పడిన వాళ్లపై యూపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రయాగ్‌రాజ్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు జావేద్ పంప్ ఇంటిని పోలీసులు కూల్చివేశారు. అక్రమంగా ఇంటిని నిర్మించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో జావేద్ పంప్ ఇంటి ఎదుట భారీ ఆందోళన చోటు చేసుకుంది. ఈ మేరకు అధికారులు ఇంటిని ఖాళీ చేయాలని ముందస్తు నోటీసులు కూడా జారీ చేశారు.
నోటీసులు జారీ చేసినా.. జావేద్ పంప్ తన ఇంటిని ఖాళీ చేయలేదు. దీంతో పోలీసులు శనివారం ఇంట్లోని సామగ్రిని బయటపడేసి.. ఇంటిని కూల్చేశారు. కాగా, ప్రయాగ్‌రాజ్ అల్లర్ల కేసులో జావేద్ పంప్ మోస్ట్ వాంటెడ్‌గా పోలీసులు గుర్తించారు. దీంతో అల్లర్లకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు. కాగా, శుక్రవారం జరిగిన అల్లర్లలో 304 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో జావేద్ పంప్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.