కొన్నిసార్లు పోలీసులు చేస్తున్న ఘటనలు అందరికీ ఆగ్రహం తెప్పిస్తున్నాయి. వాళ్ల అత్యుత్సాహం ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ కరోనా సెకండ్ వేవ్‌లో అయితే ఇలాంటి దారుణాలు అనేకం జరుగుతున్నాయి. నిబంధనలు పాటించట్లేదని జనాలను రోడ్డుపైనే వారు చితకబాదుతున్న ఘటనలు అనేకం. ఇప్పుడు మరో హృదయవిదాకర ఘటన జరిగింది.
ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పుడు లాక్డౌన్ నడుస్తోంది. అక్కడ రంజిత్ అనే యువకుడు లాక్డౌన్ సమయంలో మాస్కు లేకుండా బయట తిరుగుతూ పోలీసులకు పట్టుబట్టాడు. అంతే ఇక పోలీసులు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.
అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెల్లి చేతికి, పాదానికి మేకులు దించారు. అతను ఎంత విలవిలలాడుతున్నా పట్టించుకోకుండా రాక్షసత్వంగా ప్రవర్థించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బాధితుడు తన తల్లితో కలిసి ఎస్పీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసుల వివరణ చాలా విచిత్రంగా ఉంది. ఓ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసు నుంచి తప్పించుకునేందుకే రంజిత్ తానే మేకులు దింపుకున్నాడని వారు వాదిస్తున్నారు. మాస్క్ పెట్టుకోనందుకు కేవలం కేసు మాత్రమే నమోదు చేశామని, తాము మేకులు దించలేదని చెబుతున్నారు.