నెలకు రూ.1000తో రూ.లక్షలు ఇలా పొందండి..!

-

మీరు మంచిగా డబ్బులు పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఇది చాల బెస్ట్. పైగా దీని వలన ఏ రిస్క్ కూడా ఉండదు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… కచ్చితమైన రాబడి దీని నుండి పొందొచ్చు. మీరు కనీసం నెల కి రూ.1000 డిపాజిట్ చేసిన చాలు. ఇక ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి..? ఎంత రాబడి వస్తుంది..? వాటి కోసం కూడా చూసేద్దాం.

PPF స్కీమ్‌లో చేరితే ఖచ్చితమైన రాబాదు వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF స్కీమ్‌లో ఏ రిస్క్ ఉండదు. పైగా దీని వలన మరొక బెనిఫిట్ కూడా వుంది. అదేమిటంటే..? పీపీఎఫ్ స్కీమ్‌లో చేరితే పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

ఇక ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం వచ్చేసి 15 ఏళ్లు. మీరు కనుక కావాలి అంటే ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ కాలాన్ని ఎక్స్టెండ్ చేసుకో వచ్చు. అది పూర్తిగా మీ ఇష్టం. ఈ పీపీఎఫ్ స్కీమ్‌ లో చేరడానికి పెద్ద కష్టం కూడ కాదు. మీరు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు.

దీని కోసం జస్ట్ రూ.500 ఉంటే ఓపెన్ చేసేయవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ వస్తోంది. ఒక ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. రూ.500 డిపాజిట్ చేసినా మీ అకౌంట్ యాక్టివ్‌గానే కొనసాగుతుంది. నెలకి మీరు రూ.1000 డిపాజిట్ చేసుకుంటూ ఉంటే.. మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.3.25 లక్షలు వస్తాయి. ఇది మంచి రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news