మత్తు పదార్థాల రవాణాని అరికట్టడంలో గతప్రభుత్వం వైఫల్యం చెందింది – తానేటి వనిత

-

దేశంలో 2021 – 22 సంవత్సరంలో డ్రగ్స్ ని అత్యధిక స్థాయిలో ఆంధ్రాలోనే స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా సాగుతున్న స్మగ్లింగ్ లో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం వైసిపి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు హోంశాఖ మంత్రి తానేటి వనిత.

సీఎం జగన్ సమర్థతే దీనికి కారణమని, పోలీసు యంత్రాంగం మెరుగైన పనితీరు ఇందుకు నిదర్శనం అని కొనియాడారు. డ్రగ్స్ సరఫరాకు గట్టి ఏర్పాటు చేయడంతోనే పెద్ద ఎత్తున పట్టుబడింది అని వివరించారు. గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, మత్తు పదార్థాల రవాణా అరికట్టడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. గంజాయి సాగు జీవనాధారంగా జీవిస్తున్న గిరిజనులలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు తానేటి వనిత.

Read more RELATED
Recommended to you

Latest news