మొదటిసారిగా నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్.. తెలుగు సినిమాతో అందం అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది.
అయితే, సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం తెలుసని, పలువురు హీరోయిన్లు దీని గురించి తనకు చెప్పారని కీర్తి సురేష్ వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,’ మన ప్రవర్తన బట్టి కూడా క్యాస్టింగ్ ఉంటుందేమో. ఇలాంటి ఘటన నాకు ఎదురు కాలేదు. ఒకవేళ నన్ను ఎవరైనా కమిట్మెంట్ అడుగుతే నేను అంగీకరించను. నేను ఆ టైప్ కాదు. అవకాశాలు రాకపోతే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటాను’ అని తెలిపింది.