సోషల్ మీడియాలో అమ్మాయిలకే రిప్లైలు ఇవ్వటానికి కారణం ఏంటంటే.. అడవి శేష్

-

విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు తీస్తున్న హీరో అడవి శేషు.. ఇప్పటికే ఆయన తీసిన క్షణం నుంచి హిట్ వరకు వరుసగా 6 చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి తాజాగా ఆయన నటించిన హిట్టు చిత్రం విజయం సాధించడంతో మంచి జోష్లో ఉన్నాడు ఈ హీరో అయితే తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్ వేదికగా సమాధానాలు తెలపగా ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

మీ గూఢచారి 2 సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం హిట్టు విజయన ఆనందిస్తున్న కొన్నాళ్లపాటు ఇదే ఆనందం కొనసాగుతుంది అయితే త్వరలోనే హిట్ 2 కాదని రాసి.. దర్శకుడు వినయ్ తో ఈ సినిమాను చేస్తాను అని చెప్పుకొచ్చారు.. అలాగే హన్స్ జిమ్మెర్, థామస్‌ న్యూమాన్‌, అనిరుధ్‌, శ్రీచరణ్‌ పాకాల వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే చాలా ఇష్టమని తెలిపారు..

మళ్లీ బెంగళూరుకు ఎప్పుడు వస్తారు అని ప్రశ్నించగా.. ఇటీవల ‘హిట్‌-2’ ప్రమోషన్స్‌ కోసం అక్కడికి వచ్చాను. త్వరలోనే నా తదుపరి సినిమా షూట్‌ కోసం కూడా రావొచ్చు. ఆ నగరం నాకెంతో నచ్చింది… మీరు ఎక్కువగా రిప్లైలు అమ్మాయిలకు ఇస్తున్నారు అబ్బాయిలకి ఇవ్వడం లేదు ఎందుకు అని అడగ్గా… అబ్బాయిలు.. తన గర్ల్‌ఫ్రెండ్స్‌ని మాత్రమే సినిమాలకు తీసుకువెళ్తున్నారు. అమ్మాయిలు అయితే కుటుంబం మొత్తాన్ని థియేటర్‌కు తీసుకువెళ్తున్నారు. అదీ లెక్కా. నేను సరదాగా అన్నాను. ఎవరినైనా ఒకేలా ఇష్టపడతాను.

వరుసగా ఇన్ని సినిమాలు విజయం సాధించాయి కదా.. సినిమా కథలను మీరు ఎలా ఎంచుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు.. సినిమా కథల విషయంలో నేను చాలా తేలికగా నిర్ణయం తీసుకుంటా. ఎవరైనా నాకు కథలు చెప్పినప్పుడు ప్రేక్షకుడిగా వింటాను. ఒకవేళ అది బోర్‌ కొడితే వెంటనే నో అని చెప్పేస్తాను. ఆసక్తిగా అనిపిస్తే ఓకే చెబుతాను. హీరోగా ఎప్పుడూ కథలు వినలేదు. సినిమాల్లో బిల్డప్‌ అనేది అవసరం లేదు. సినిమా బాగుంటే ప్రేక్షకులే నాకు బయట బిల్డప్‌ ఇస్తారు. ‘హిట్‌-2’ విషయంలోనూ అదే జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news