తెలంగాణలో ఉన్న పథకాలు మరే రాష్ట్రాలలో లేవు – స్పీకర్ పోచారం

-

సిరిసిల్ల: జిల్లెల్ల వ్యవసాయ కళాశాల దేశంలోనే అత్యుత్తమ కళాశాల అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో పేరుగాంచిన వ్యక్తి కేటిఆర్.. మేము 47 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కంటే మిన్నగా సిరిసిల్లను కేటిఆర్ అభివృద్ధి చేశారన్నారు. ఊబికి వచ్చిన భూగర్భ జలాలలో రాజన్న సిరిసిల్ల రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలిచింది.

ఐఏఎస్ లకు పాఠంగా మారిందన్నారు. దీనికి కారణం సిఎం కేసిఆర్ అన్నారు పోచారం. ఇన్ని రిజర్వాయర్ లు వస్తాయని ఎవ్వరైనా ఊహించారా? అన్నారు. తెలంగాణలో ఒక కోటి 8 లక్షల నుంచి 2 కోట్ల 30 లక్షల కు సాగు విస్తీర్ణం పెరిగింది అంటే కేసిఆర్ కృషేనన్నారు. కేసిఆర్ నాయకత్వంలో మంత్రి కేటీర్ ప్రత్యేక చొరవ తో 10 లక్షల మందికి ఐటీలో ఉపాధి లభించిందన్నారు స్పీకర్ పోచారం. 22 వేల పరిశ్రమలు కొత్తగా వచ్చాయని.. 19 లక్షల మందికి నాన్ ఐటీ రంగంలో ఉపాధి లభించిందన్నారు. తెలంగాణ పథకాలను మహారాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారని.. తెలంగాణలో ఉన్న పథకాలు మరే రాష్ట్రాలలో లేవన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news