‘నాలాంటి చెల్లి ఉండటం నీ అదృష్టం..’ గౌతమ్ కు సితార స్పెషల్ విషెస్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితారకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా ఇంస్టాగ్రామ్ లో తనకంటూ ఒక ఎకౌంటును క్రియేట్ చేసుకున్న సితార భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఈ వేదికగా తెలుపుతూ వస్తుంది. తాజాగా సిబ్లింగ్ డే సందర్భంగా తన అన్న గౌతమ్ కు స్పెషల్ విషెస్ తెలిపింది సితార.

సితార గట్టమనేని తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా తన అన్న గౌతమ్ కృష్ణ ఫోటోను షేర్ చేసుకుంది. సిబ్లింగ్ డే సందర్భంగా వీరిద్దరి క్యూట్ ఫోటోను షేర్ చేసుకున్న సితార నాలాంటి సిస్టర్ నీకు ఉండటం నీ అదృష్టం అంటూ కామెంట్ పెట్టింది. అంతేకాకుండా హ్యాపీ సిబ్లింగ్ డే అంటూ చెప్పుకొచ్చింది.

కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న సీతారకు ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉండటం చెప్పుకోదగిన విషయం. అలాగే ఇప్పటికే తన సొంత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన సితార పలు కమర్షియల్ యాడ్స్ లో సైతం నటించి మెప్పిస్తుంది. తన అన్న గౌతమ్ ను ప్రతి విషయంలో డామినేట్ చేసే విధంగా యాక్టివ్ గా ఉంటుంది సితార. అలాగే సితార త్వరలోనే సినిమాల్లో అడుగుపెట్టనుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేశ్ బాబు ఇప్పటికే తన కొడుకు గౌతమ్‌ను చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం చేశాడు. వన్ నేనొక్కడినే సినిమాతో గౌతమ్ తెలుగు వరకు పరిచయం అయ్యాడు. అలాగే ‘సర్కారు వారి పాట’ కోసం తన కూతురు సితార ఘట్టమనేనితో ఓ ప్రమోషనల్ సాంగ్‌ను కూడా చేయించాడు. ఈ ప్రమోషన్ తోనే సితార సినిమాల్లోకి అడుగుపెడుతుందని వార్తలు అప్పట్లో గట్టిగా వినిపించాయి కానీ అది నిరాశగానే మారింది మరి సితార సినిమా ఎంట్రీ పై త్వరలో ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news