హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి బిజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఏవిఎన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి బిజెపి నేతలు డీకే అరుణ, రామచంద్ర రావు, వివేక్ వెంకటస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని అన్నారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థులు పురుగుల అన్నం తింటున్నారని.. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారలేదన్నారు. ఉపాధ్యాయ లోకమంతా AVN రెడ్డికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజేపీ మాత్రమేనన్నారు డీకే అరుణ. విద్యావంతులు, ఉపాధ్యాయులు బిజేపీ బలపర్చిన అభ్యర్థికి అండగా నిలవాలన్నారు. విద్యార్థులకు సరైన వసతులు లేవని.. కిరాయి భవనాల్లో స్కూల్లోనూ నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.