ఆరో విడత ప్రజా సంగ్రామ యాత్రకు బిజెపి సన్నాహాలు

-

రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలని తెలంగాణ బిజెపి నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు బిజెపి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో తెలంగాణ వ్యాప్తంగా యాత్రను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బిజెపి నేతలు, కార్యకర్తలు కూడా పాదయాత్రను కొనసాగించాలని బండి సంజయ్ ని కోరుతున్నారు.

దీంతో అధిష్టానం కూడా బండి సంజయ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా శ్రేణులంతా పనిచేయాలని బండి సంజయ్ పిలుపునిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బిజెపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆరో విడత పాదయాత్రను 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొడంగల్ నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు రాష్ట్ర నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి ఆరో విడత యాత్ర ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ వద్ద రాష్ట్ర నాయకత్వం ప్రపోజల్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news